2 September, 2026 | 11:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

అగధలో నటి మంజుల మనవరాలు

01-05-2026 | 01:29am

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్‌తో ‘మనుషులంతా ఒక్కటే’, ‘మగాడు’, ‘నేరం నాది కాదు’ ‘ఆకలిది’, ‘ఏయన్నార్‌తో ‘దొరబాబు’, ‘బంగారు బొమ్మలు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘కృష్ణతో ‘మాయదారి మల్లిగాడు’, ‘రక్తసంబంధాలు’, శోభన్‌బాబుతో ‘మంచి మనుషులు’, ‘పిచ్చిమారాజు’ వంటి ఎన్నో సూపర్ హిట్స్‌లో నటించారామె. మంజుల కూతురు వనితను ‘దేవి’తో నటిగా పరిచయం చేశారు ఎంఎస్ రాజు.

ఆయనే ఇప్పుడు మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్‌ను ‘అగధ’ చిత్రంతో నటిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో జోవిక పాత్ర పేరు హరిణి. గురువారం విడుదల చేసిన ఆమె క్యారెక్టర్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: రాకేశ్ వెంకటాపురం; సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి; ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ; ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్.