కోదాడలో కల్తీ వంట నూనె
స్వాధీనం చేసుకున్న పోలీసులు
కోదాడ, మార్చి 14 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కల్తీ వంట నూనె దం దా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ట్యాంకర్లలో కల్తీ వంట నూనెను తీసుకొచ్చి కోదాడలో బ్రాండెడ్ కంపెనీ ఖాళీ డబ్బాల్లో నింపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ నూనెను కొంతమంది స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
ఆ నూనెనే వినియోగదారులకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చె లగాటం ఆడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైవే పక్కన ట్యాంకర్ నుంచి కల్తీ నూనెను అన్‌లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘట నా స్థలానికి చేరుకుని నూనె శాంపిల్స్ సేకరించి ప రిశీలన కోసం పంపించారు. ఇంత జరుగుతున్నా కోదాడలో కల్తీ వంట నూనె దందా మాత్రం ఆగ డం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




