22 May, 2026 | 10:48 AM

వడదెబ్బ తగిలి హమాలి చర్లపల్లి సోమయ్య మృతి

22-05-2026 10:04 AM

ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకోలు

తుంగతుర్తి ఏప్రిల్ 22: తుంగతుర్తి మండల కేంద్రంలో వడదెబ్బతో హమాలి చర్లపల్లి సోమయ్య మృతి. చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన చర్లపల్లి సోమయ్య(60) గత కొద్ది రోజుల నుండి తుంగతుర్తి సహకార సొసైటీ ధాన్యం కొనుగోలు సెంటర్లో హమ్మాలిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గడచిన మూడు రోజుల నుండి ఎండ తీవ్రంగా ఉండడంతో. గురువారం మధ్యాహ్నం లారీ లోడు వేస్తున్న సందర్భంలో వడదెబ్బ తగిలి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా దావకానకు తరలిస్తుండగా ,మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి కుమార్తె ఉన్నది. హమాలి విధులు నిర్వర్తిస్తుండగా, మృతి చెందడం బాధాకరం. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిల విచారణ జరిపి, కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించాలని, హమాలి సంఘ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.