ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
గుడిహత్నూర్, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ పాల్గొని ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ సమాజ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సంస్కృతి మన దేశ సంపద అని, ఆదివాసీ ఆత్మగౌరవం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జాలీం, శివాజీ యువసేన అధ్యక్షులు సందీప్, మండల నాయకులు కార్యకర్తలు ఆదివాసి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






