ఉద్యమకారులకు సరైన గుర్తింపు రాలేదు
ప్రొఫెసర్ కోదండరాం
మంచిర్యాల టౌన్, జూలై 12 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు సరైన గుర్తింపు, న్యాయం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆది వారం మంచిర్యాల జేఏసీ ఆధ్వర్యంలో సుచిత్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉదృతంగా నడపడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషిని అందించిన ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభిప్రాయ పడ్డారు.
భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ కావాలని మనం కోరుకుంటే అది జరగలేదని వాపోయారు. దీన్ని సరిదిద్దడానికి, అదే విధంగా అసలైన ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయము అందించడానికి ఈ జిల్లా జేఏసీ కొన్ని ప్రతిపాదనలను ప్రొఫెసర్ కోదండ రాంకు ప్రతిపాదనలను అందించారు. అంతకు ముందు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచినటువంటి ఐబీ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేసిన తరువాత, అమరవీరుల స్తూపం దగ్గర అమరులకు నివాళులు అర్పించారు. మంచిర్యాల జేఏసీ చైర్మన్ గోనె శ్యాం సుందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జే ఏ సీ నాయకులు గురజాల రవీందర్ రావు, బాబన్న, తొగరి సుధాకర్, కెవి ప్రతాప్, సంజీవ్, చిలుకూరి కమల్,
నయనాల గోవర్ధన్, ఎండి జాఫర్ హుస్సేన్, అడ్డిచెర్ల సాగర్, మలయశ్రీ, రామగిరి రాజన్న, కోరెళ్ళ రామిరెడ్డి, శ్రీమన్నారాయణ, గోషిక మల్లేశం, ఎండి సంధాని, కర్ర లచ్చన్న, అందే మంగ, అన్ని ప్రజా సంఘాలు, విద్యా వంతుల వేదిక, విద్యుత్ జేఏసీ, డాక్టర్ జేఏసీ, టీచర్ జేఎసి, ఆర్టీసీ, అడ్వకేట్, సింగరేణి, ప్రైవేట్ పాఠశాలల జేఏసీలు, మహిళా జేఏసీ, విద్యార్థి సంఘాల జేఏసీలు, కళాకారుల జేఏసీ, అన్ని కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






