01-02-2026 12:00:00 AM
కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్
జవహర్‌నగర్, జనవరి 31 (విజయక్రాంతి) : జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూములు (వివిధ సర్వే నంబర్ 205, 364, 497 695 మరియు 696) లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణల పై స్పందించిన కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రమేష్, సత్యనారాయణ మరియు రెవిన్యూ సిబ్బంది కలసి జేఏసీ సహకారంతో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న నిర్మాణాలను శనివారం కూల్చివేశారు.
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణలు చేస్తే చర్యలు తప్పవని తహశీల్దా ర్ బైరెడ్డి రాజేష్ రెవిన్యూ అధికార సిబ్బందితో హెచ్చరించారు. ఏదిఏమైనా ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్న నిర్మాణలు మళ్ళీ జరగకుండా ఉండాలండే ప్రభుత్వ భూములు కబ్జా చేద్దాం అని ఆలోచిస్తున్న భూకబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని అన్ని వర్గాల ప్రజల తరపున విన్నపాలు వస్తున్నాయన్నారు.