2 May, 2026 | 6:54 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ఏపీ సెంటర్లో అక్రమాలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

02-05-2026 05:33 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక హాజరుకాని కార్యదర్శులు అధికారులపై చర్యలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): ధాన్యం ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై  శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మండల కేంద్రంలో డిఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గస్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నిర్వహించి, అధికారులతో జరిగిన అభివృద్ధిపై ముఖాముఖి మాట్లాడారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐకెపి కేంద్రాలు పెట్టి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్న తరుణంలో, గొట్టిపర్తి ఐకెపి కేంద్రంలో జరిగిన అవకతవకలపై  పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గ స్థాయి సమావేశ కార్యక్రమానికి రాని అధికారులు కార్యదర్శులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓ యాదగిరిని ఆయన కోరారు.  నియోజకవర్గంలో గడిచిన రెండు సంవత్సర కాలంలో సుమా 2000 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ విద్యా వైద్యం వ్యవసాయం శాఖల అధికారులతో ముఖాముఖి మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లో మండలాల్లో బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి పాల్గొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని కోరారు. తిరుమలగిరిలో 200 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూలు, 45 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ దవాఖాన, తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల, నూతన రహదారుల రోడ్ల నిర్మాణం, సంగం బ్రిడ్జి నిర్మాణం, ఇవన్నీ అభివృద్ధికి నాంది పలుకుతాయనే అన్నారు.

నియోజకవర్గంలో ప్రతి శాఖలో పనిచేస్తున్న అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నియోజకవర్గస్థాయి విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న, డీఈఓ బిక్షమయ్య, తాసిల్దార్ దయానందం ఎంపీడీవో శెష్ కుమార్ మాజీ పిఎసిహెచ్ చైర్మన్ గుడిపాటి సైదులు, రేగటి రవి గౌడ్, దాసరి శ్రీను, చిలకల వెంకన్న,  వివిధ మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.