గుర్తింపు లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
మొయినాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): మండలంలో గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫార్మ్ల బలవంతపు విక్రయాలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మండల ఎంఈఓకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలు నడపడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి చరణ్ గౌడ్ విమర్శించారు.
ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు విద్యా సామగ్రిని తమ వద్దే కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.నచ్చిన చోట పుస్తకాలు, యూనిఫార్మ్లు కొనుగోలు చేసే స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఇవ్వాలని, విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చరణ్ గౌడ్, వికాస్, నవీన్, అభి పాల్గొన్నారు.






