26 May, 2026 | 5:06 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

03-01-2026 12:00 AM

కొత్తపల్లి, జనవరి 2 (విజయక్రాంతి): తీగల గుట్టపల్లి లో నక్ష తోవ  కబ్జా చేసి , మట్టి రోడ్డు పనులు జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కోలగని అనిల్ అతని తండ్రి లక్ష్మయ్యపై  చట్టపరమైన చర్యలు  తీసుకోవాలని కోరుతూ తీగలగుట్టపల్లి రైతులు కాశెట్టి దామోదర్ ,దాసరి ప్రభాకర్ గాజే నరేష్ ,కొలగాని దివాకర్, దాసరి అనిల్ ,దాసరి అశోక్ వడ్నాల తిరుపతి ,కొట్టే సాయి కిరణ్ ,దాసరి భూపతి, దాసరి గోపయ్య, కాశెట్టి రమేష్ చింతపండు కనకయ్య ,గాజే సంతోష్ ,గాజ సురేష్ తదితర రైతులు  శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

తీగల గుట్టపల్లి ప్రజల అవసరాలకు  ఉపయోగపడే నక్ష రహదారి కబ్జాకు గురి కావడంతో లోగడ మండల సర్వేయర్ తో సర్వే చేయించి , రోడ్డు కోసం హద్దురాళ్ళు  కూడా ఏర్పాటు చేయడం జరిగిందని  ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం   కరీంనగర్ నగరపాలక సంస్థ ఇక్కడి ప్రాంతంలో మట్టి రహదారిని  ఏర్పాటు చేయడానికి నిధులు కూడా మంజూరు చేసిందని తెలిపారు.

అయితే  కాంగ్రెస్ నేత కొలగని అనిల్, అతని తండ్రి లక్ష్మయ్య మట్టి రోడ్డు నిర్మాణ పనులు జరగకుండా  అడ్డుకుంటున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ , స్థానిక ప్రజలను, రైతులను దుర్భాషలాడుతూ పనులు జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేత కొలగని అనిల్, అతని తండ్రి లక్ష్మయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకొని , నక్షత్రోవ నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని  రైతులు ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.