18 July, 2026 | 12:31 AM

పెద్దపల్లి జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

18-07-2026 12:12 AM
  1. రూ. 20 వేల జరిమానా విధించిన పెద్దపల్లి పోక్సో కోర్టు
  2. ప్రేమ పేరుతో నమ్మించి బాలికపై లైంగిక దాడి
  3. పోలీసుల పకడ్బందీ దర్యాప్తుపై సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు

పెద్దపల్లి, జూలై 17(విజయ క్రాంతి)ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి, లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన నిందితుడికి పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన దు న్నపోతుల కుమార్ (23) అనే యువకుడు, అదే మండలానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను తరచూ వెంబడిస్తూ ప్రేమ పేరుతో వేధించేవాడు.

ఒకరోజు బాధితురాలు ఒంటరిగా కరీంనగర్లోని తన అక్క ఇంటికి వెళ్తుండగా, నిందితుడు ఆమెను వెం బడించి బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. సుల్తానాబాద్ సమీపంలోని రేగడి మద్దికుంట సెల్ టవర్ వద్దకు తీసుకెళ్లి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ మెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా గ్రామంలోని మరో ప్రాంతంలో ఆమెపై రెండోసారి అత్యాచారానికి ఒడిగట్టా డు. కొన్ని రోజులకు బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది.

బాధితురాలు పెళ్లి చేసుకోవాలని నిందితుడిని కోరగా నిరాకరించడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి పోత్కపల్లి ఎస్‌ఐ ఎస్. లక్ష్మణ్ కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ ఎస్. సారంగపాణి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు

పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం, న్యాయమూర్తి శ్రీమతి స్వప్నరాణి ఇరుపక్షాల వాదనలు విన్నారు. నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో దున్నపోతుల కుమార్కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని యెడల అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసు లో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

పోలీస్ బృందానికి సీపీ అభినందనలు

బాధితురాలికి న్యాయం జరిగేలా సాక్ష్యాధారాలను పకడ్బందీగా కోర్టులో ప్రవేశపె ట్టిన పోలీస్ బృందాన్ని రామగుండం పోలీ స్ కమిషనర్ మరియు డీఐజీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి, ఏసీపీ జి. కృష్ణ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన సుల్తానా బాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు, పోత్కపల్లి ఎస్త్స్ర చి. సనత్ కుమార్, కోర్టు కాని స్టేబుల్ పి. శ్రీనివాస్, లైజన్ ఆఫీసర్ పి. కోటేశ్వరరావు లను ఉన్నతాధి కారులు కొనియాడారు.