20-02-2026 07:03:30 PM
చివ్వెంల,(విజయక్రాంతి): కడకడ గ్రామంలో నిన్న జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై భాదితురాలి బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 19, 2026న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా నిందితుడు బోయిండ్ల మహేశ్‌ను అదే రోజు సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈరోజు అతనిని విచారించి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో రూరల్ సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ మాహేశ్వర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.