13 August, 2026 | 5:12 AM

పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

13-08-2026 01:34 AM

మెట్ పల్లి, ఆగస్ట్12(విజయక్రాంతి): ప్రజ ల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు చేయూత పింఛన్ మంజూరుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, ది వ్యాంగులు, చేతివృత్తులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, తలసేమియా, సికి ల్ సెల్ వ్యాధిగ్రస్తులు తదితర అర్హత ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నా రు.అర్హత కలిగిన వారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును మున్సిపల్ కార్యాల యం లో సమర్పించాలని, దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి, నిర్ణీత గడు వులోగా దరఖాస్తులు సమర్పించాలని ము న్సిపల్ కమిషనర్ కోరారు.