9 May, 2026 | 10:13 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

03-03-2026 01:21 AM

కుత్బుల్లాపూర్‌లో పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

కుత్బుల్లాపూర్, మార్చి 2 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యా లయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ విషయంలో జూనియర్ అసిస్టెంట్ గణేష్ బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.

అందులో భాగంగా మొదట రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.15 వేలు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.