18 July, 2026 | 9:40 PM

తెలంగాణలో అడుగుపెట్టిన ఏబీడీ మాస్ట్రో

18-07-2026 08:54 PM

హైదరాబాద్, 17 జూలై 2026: ఏబీడీ మాస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్ సూపర్-ప్రీమియం, లగ్జరీ స్పిరిట్స్ విభాగానికి చెందిన అనుబంధ సంస్థ, అవార్డు గెలుచుకున్న మూడు ప్రీమియం విస్కీలైన ఏవోడీహెట్ ఐరిష్ విస్కీ, వుడ్ బర్న్స్ కాంటెంపరరీ రేర్ ఇండియన్ విస్కీ,యెల్లో డిజైనర్ విస్కీలను తెలంగాణలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏబీడీ మేస్ట్రోను బాలీవుడ్ సూపర్ స్టార్ మిస్టర్ రణవీర్ సింగ్ సహ-స్థాపించారు.ఏవోడీహెచ్ ఒక క్లాసిక్ ఐరిష్ విస్కీ.

దాని ప్రత్యేకమైన మృదుత్వం, సులభంగా ఆస్వాదించగల రుచిని అందించేందుకు దీనిని మూడుసార్లు స్వేదనం చేశారు. వుడ్ బర్న్స్  భారతదేశానికి గర్వకారణమైన అవార్డు విజేత విస్కీ. 2025లో నిర్వహించిన కాంకోర్స్ మాండియల్ డి బ్రస్సెల్స్ వారి 27వ స్పిరిట్స్ సెలెక్షన్‌లో ‘రెవలేషన్ బ్లెండెడ్ విస్కీ’ అవార్డుతో పాటు ‘గ్రాండ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ విస్కీ బ్రాండ్‌గా ఇది నిలిచింది. యెల్లో సంప్రదాయాలకు భిన్నంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పే డిజైనర్ విస్కీ. స్కాచ్, భారతీయ మాల్ట్‌ల సమ్మేళనంతో రూపొందించిన ఈ ప్రత్యేక ఖండాంతర బ్లెండ్, ఆధునిక భారతీయ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.

ఈ 3 సూపర్-ప్రీమియం విస్కీల విడుదల, తెలంగాణ వ్యూహాత్మక మార్కెట్‌లో ఏబీడీ మేస్ట్రో ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ తొలి విడుదలను ప్రకటిస్తూ, మిస్టర్ విక్రమ్ బసు, మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు. “తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్, అత్యుత్తమ నాణ్యత గల ప్రీమియం ఆల్కహాల్ ప్రోడక్టులను కోరుకునే కస్టమర్లతో సూపర్-ప్రీమియం స్పిరిట్స్‌కు కీలకమైన మార్కెట్‌గా ఎదిగింది. గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఈ ప్రాంతంలోని కస్టమర్లు నాణ్యతను, అత్యున్నత హస్తకళా నైపుణ్యాన్ని విలువైనవిగా భావిస్తారు.

ఏవోడీహెచ్ ఐరిష్ విస్కీ, వుడ్ బర్న్స్ కాంటెంపరరీ ఇండియన్ విస్కీ, యెల్లో డిజైనర్ విస్కీ అనే మా మూడు బ్రాండ్‌లు ఆధునిక విలాసాన్ని కొత్త కోణంలో ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు విభిన్నమైన అనుభూతిని అందిస్తాయన్నారు. హైదరాబాద్ నేడు భారతదేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం ఆల్కహాల్ మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. బలమైన పబ్, బార్, రెస్టారెంట్ సంస్కృతి, యువ కాస్మోపాలిటన్ కస్టమర్లు, ప్రపంచ స్థాయి అనుభవాల పట్ల పెరుగుతున్న ఆసక్తి కారణంగా కొత్త ప్రీమియం బ్రాండ్‌లకు ఇక్కడ విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ధోరణి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర నగరాలకు కూడా విస్తరిస్తోంది.