09-02-2026 12:29:48 AM
వెంకటాపూర్, ఫిబ్రవరి08,(విజయక్రాంతి):యువజన వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మేరా యువభారత్ విభాగం వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని యూత్ హాస్టల్లో ఐదు రోజులపాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన 37 మంది యువతి యువకులు ములుగు జిల్లా పాలంపేటలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించారు.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయ శిల్పకళను చూసి యువత మంత్రముగ్ధులయ్యారు. ఆలయ నిర్మాణ శైలి, శిల్పాల నైపుణ్యం, చారిత్రక ప్రాశస్త్యంపై ఆసక్తిగా తెలుసుకున్నారు. ఇలాంటి ప్రపంచ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా వా రు అభిప్రాయపడ్డారు. అనంతరం యువజన బృందం లక్నవరం సరస్సును సంద ర్శించారు.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లక్నవరం సరస్సు అద్భుతమైన ప్రకృతి అందా లతో ఆకట్టుకుందని తెలిపారు. అక్కడి వాతావరణం, ఏర్పాట్లు చూసి తాము కేరళలోనే ఉన్న భావన కలిగిందని యువత పేర్కొన్నా రు. ఈ పర్యటన తమ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వ రంగల్ సూపర్డెంట్ బానోత్ దేవీలాల్, మే రా యువభారత్ వాలంటీర్లు వెల్దండ సురే ష్, విజయ్తో పాటు యువతి యువకులు పాల్గొన్నారు.