10-02-2026 12:00:00 AM
భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్ర తెరపైకి రానుంది. ‘విప్లవ వీరుడు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తుండగా.. జైశ్వర్-, సోనాలి జంటగా నటిస్తున్నారు. ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కథానాయకుడు జైశ్వర్ మాట్లాడుతూ.. “ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచిపోతుంది” అని చెప్పారు. ‘ఇది నా మొదటి సినిమా. అందరి ఆశీర్వా దం కావాలి’ అని కథానాయకి సోనాలి అన్నారు. దర్శకుడు నాగరాజు రావు మాట్లాడుతూ.. “ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. బ్రిటిష్ కాలం నాటి హిస్టారికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం” అని తెలిపారు.
నిర్మాత ఏవీ జయ రాం మాట్లా డుతూ.. “టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. మంచి సందేశం ఇచ్చే సినిమా అవుతుంది” అని చెప్పారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ.. “స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నా. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు పటేల్ అశోక్‌రెడ్డి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.