6 July, 2026 | 4:05 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

ఎస్.జి.ఎఫ్. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు పారమిత విద్యార్థి

18-12-2025 12:00 AM

ముకరంపుర, డిసెంబరు 17 (విజయ క్రాంతి) : నగరంలోని  పారమిత ఉన్నత పాఠశాల  విద్యార్థి ఎం.చాణక్యన్  రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు  ఎంపిక అయ్యాడని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 15 న కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో  జిల్లా ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎస్.జి.ఎఫ్ అండర్ 14 బాలుర  బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలలో చాణక్యన్ 32 -34 కిలోల విభాగంలో బంగారు పధకం సాధించి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు.

హన్మకొండ పట్టణంలోని జె.ఎన్ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ లో ఈ నెల 18 నుండి  25 వరకు  నిర్వ హించనున్న 69వ రాష్ట్ర స్థాయి   బాక్సింగ్  చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా  పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్ ,  హనుమంతరావు. ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత ప్రసాద్ సమన్వయకర్త శ్రీనాథ్ విద్యార్థిని, బాక్సింగ్ కోచ్  ఎ రామకృష్ణ ను అభినందించారు.