12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

గుట్టు చప్పుడు కాకుండా మైనర్ బాలికకు పెళ్లి

09-05-2026 12:00 AM

స్పందించిన అధికారులు ఇరు కుటుంబాలపై కేసులు నమోదు 

అయిజ మే 8 : అయిజ మండలంలో ఒక గ్రామంలో మైనర్ బాలికకు బలవంతపు వివాహం జరిపించడం వల్ల ఇరువురి పెద్దలపై కేసులు నమోదు అయిన సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. ముందుగా అమ్మాయిని బలవంతాన పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేయగా అమ్మాయి దైర్యంగా 1098 కు ఫోన్ చేసిందని స్పందించిన అధికారులు వెంటనే ఆ అమ్మాయిని బాలల సంరక్షణ కేంద్రాని(జిల్లా సఖి కేంద్రం )కి తీసుకెళ్లారని తెలిసింది.

ఇక్కడే అసలు వ్యవహారం మలుపు తిరిగింది. ఆ గ్రామంలోని కొందరు పెద్దలతో అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయికి మైనారిటీ తీరేంతవరకు వివాహం చేయమని సఖి కేంద్రం అధికారులకు రాతపూర్వకమైన హామీ పత్రంతో అమ్మాయిని బయటికి తీసుకొచ్చి తమ గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా వివాహం జరిపించారని, నమ్మదగిన సమాచారం మేరకు అధికారులు స్పందించి విచారణ చేయగా వివాహమైందని తెలిసి దీనికి కారకులైన కొందరు వ్యక్తులపై కేసు నమోదయిందని స్థానిక ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు.