28 August, 2026 | 11:20 PM

సోదరుల క్షేమాన్ని కోరుతూ.. రాఖీలు కట్టిన సోదరీమణులు...

28-08-2026 10:30 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఘనంగా రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణం, పరిసర ప్రాంతాల్లో సోదర సోదరీమణులు ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, నుదుట తిలకం దిద్ది, స్వీట్లు తినిపించి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. సోదరులు సైతం తమ సోదరీమణులపై ఉన్న ఆప్యాయతను వ్యక్తం చేస్తూ వారికి బహుమతులు అందించి, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు ఒకచోట చేరడంతో ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు.సోదరీమణులు ప్రత్యేకంగా రాఖీలను సిద్ధం చేసుకుని సోదరుల చేతికి కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ఆకాంక్షించారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.