ఘనంగా 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణ
28-08-2026 10:27 PM
రాఖీ పండుగ జరుపుకున్న భక్తులు
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు 44వ గిరిప్రదక్షిణ శుక్రవారం గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆద్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా భక్తులు దాదాపు ఆరు వేల మంది వచ్చి, 8 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. మార్గ మధ్య లో గురువు కు భక్తులు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






