5 June, 2026 | 4:46 PM

ఓరుగల్లులో వానజల్లు

05-06-2026 01:41 AM

మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం అక్కడక్కడ వానజల్లులు కురిసా యి. గత వారం రోజులుగా విపరీతమైన ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వానజల్లులు కాస్త ఉపశమనాన్ని కలి గించాయి. కొన్నిచోట్ల తేలికపాటి వానజల్లు కురువగా, మరి కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో దాన్యం తడవకుండా రైతులు రక్షణ ఏర్పాటు చేసుకున్నారు.

మరి కొన్ని చోట్ల ధాన్యం కొంత తడిసింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొ నుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాయని, జూన్ రెండో వారంలో తెలంగాణలో తొలకరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని వేగవంతంగా ముగించాలని రైతులు కోరుకున్నారు.