14 March, 2026 | 11:49 AM

తోటి స్నేహితుల ఆడబిడ్డల కోసం ‘బంగారు తల్లి’

14-03-2026 12:51 AM

భీమదేవరపల్లి, మార్చి 13 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంముల్కనూర్ జెడ్పిహెచ్‌ఎస్లో 199798 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రబృందం తమ స్నేహబం ధాన్ని కేవలం జ్ఞాపకాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తోటి స్నేహితుల కుటుంబాలకు అవసరమైనప్పుడు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ మిత్రబృందం బంగారు తల్లి అనే వినూ త్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా తమతో కలిసి చదువుకున్న స్నేహితుల ఆడబిడ్డల వివాహాలకు సహా యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా తమ తోటి స్నే హితుడు వంగరాజు కుమార్తె సిరి వివాహం సందర్భంగా మిత్రబృందం సభ్యులు కలిసి రూ.70 వేల నగదు సహాయంతో పాటు పట్టు వస్త్రాలను అందజేసి తమ ఆప్యాయతను, స్నేహబంధాన్ని చాటుకున్నారు.పాఠశాలలో కలిసి చదువుకున్న ఈ స్నేహితులు గత 25 సంవత్సరాలుగా పరస్పర సహకారం, అనుబంధంతో తమ స్నేహాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు.

ఎవరికైనా కష్టం వచ్చి నప్పుడు అందరూ కలిసి సహాయం చేయ డం, సంతోషకర సందర్భాల్లో భాగస్వాము లు కావడం వంటి మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ స్నేహాన్ని మరింత అర్థవంతంగా మార్చేందుకు ‘బంగారు తల్లి’ అనే పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

సమాజంలో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడం  గొప్ప పుణ్యకార్యంగా భావించిన ఈ మిత్రబృందం, భవిష్యత్తులో కూడా  తోటి స్నేహి తుల కుటుంబాలకు అవసరమైనప్పుడు ఇ లాంటి సహాయ సహకారాలను అందిస్తూ సంకల్ప బలంతో ముందుకు కొనసాగిస్తామని వారు వ్యక్తం చేశారు. పరస్పర సహకారంతో సమాజానికి మంచి సందేశాన్నిఇచ్చే విధంగా కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్న  ముల్కనూర్ జెడ్పిహెచ్‌ఎస్ 1997- 1998 బ్యాచ్ విద్యార్థులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.