విలీనం సరే.. నిధులేవి?
జిహెచ్‌ఎంసిలో విలీనమైన మున్సిపాలిటీలలో సమస్యల తాండవం
తాగునీటి కొరత, గుంతల మయమైన రోడ్లు
పేరు పట్నం.. తీరు అధ్వానం
ఈసారైనా మంజూరయ్యేనా?
మేడ్చల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాదులో విలీనమైన మున్సిపాలిటీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పట్నం హోదా వచ్చిన ఈ ప్రాంతాలను స మస్యలు వెంటాడుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 9 మున్సిపాలిటీలు, నా లుగు నగర కార్పొరేషన్లను ప్రభుత్వం మొ దట జిహెచ్‌ఎంసిలో విలీనం చేసింది. ఆ త ర్వాత జిహెచ్‌ఎంసి ని మూడు ముక్కలు చేయగా రెండు కార్పొరేషన్లలో ఈ ప్రాంతా లు విలీనం అయ్యాయి.
కానీ ఈ ప్రాంతాల అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించలే దు. వాస్తవానికి విలీన మున్సిపాలిటీలకు ని ధులు అత్యవసరం ఉంది. ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నందున అవి పరిష్కరించడానికి నిధులు కావాలి. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో విలీనమైన గ్రా మాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మం జూరు చేసింది. మేడ్చల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున మంజూరు చేసింది. జిహెచ్‌ఎంసిలో విలీనమైన మున్సిపాలిటీలు, కా ర్పొరేషన్లకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
ప్రస్తుతం ఈ మున్సిపాలిటీ లలో రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. మంచినీటి సమస్య ఏర్పడింది. సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్తగా ఏర్పడ్డాయి. గతంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో పె ద్దగా సమస్యలు లేకున్నా కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. రోడ్లమీద గుంతలు పూడ్చడానికి తట్టెడు మట్టి పోసే పరిస్థితిలో సర్కిల్ కార్యాలయాలు లేవు.
నిధుల మంజూరులో నిర్లక్ష్యం
నిధుల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే సమస్యలు పరిష్కా రం కావడం లేదు. అక్టోబర్లో ప్రభుత్వం రా ష్ట్రంలోని 138 మున్సిపాలిటీలలో 2432 పనులు చేపట్టడానికి రూ. 2780 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు కేటాయించింది. ఆ సమయంలో మేడ్చల్ మల్కా జ్గిరి జిల్లాలోని మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, ఘట్కేసర్, పోచారం, తూముకుంట మున్సిపాలిటీలకు నిధులు మంజూరు కాలేదు. రా ష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు పెద్ద మొత్తం లో నిధులు మంజూరు చేసి కేవలం మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు మాత్రమే ఎందుకు మంజూరు చేయలేదో అర్థం కాలేదు.
అప్పటికి మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసిలో విలీనం కాలేదు. అప్పటికే రింగురోడ్డు లోప ల ఉన్న మున్సిపాలిటీలను జిహెచ్‌ఎంసి లో విలీనం చేస్తారని ప్రచారం ఉంది. విలీనమయ్యే దమ్మాయిగూడ, నాగారం, దుండిగ ల్ మున్సిపాలిటీలతోపాటు పిర్జాది గూడా, జవహర్ నగర్ నిజాంపేట్ కార్పొరేషన్ లకు రూ.18.70 కోట్ల చొప్పున మంజూరు చేసింది. మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, ఘట్కేసర్, పోచారం మున్సిపాలి టీలకు కూడా నిధులు మంజూరు చేసి ఉంటే రోడ్లన్నీ అద్దంలా తయారయ్యేవి.
15వ ఆర్థిక సంఘం నిధులు కూడా.....
కొన్ని మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మంజూరు కాలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు అయిన మున్సిపాలిటీలకు మాత్రమే మంజూరయ్యాయి. పన్ను వసూలులో వెనుకబడిన గుండ్ల పో చంపల్లి, ఘట్కేసర్, కొంపల్లి మున్సిపాలిటీ లు, బోడుప్పల్, జవహర్ నగర్ కార్పొరేషన్ లకు నిధులు మంజూరు కాలేదు.
ఈసారైనా మంజూరయ్యేనా?
రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల జిహెచ్‌ఎంసి కి రూ .4 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. రోడ్లు తాగునీటి ప్రాజెక్టుల కో సం ఖర్చు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కనీసం ఇందులో నుంచైనా విలీ నమైన మున్సిపాలిటీలలో అభివృద్ధి పను లు చేపట్టడానికి నిధులు కేటాయిస్తారని ప్ర జలు ఆశిస్తున్నారు. విలీనమైన మున్సిపాలిటీ ప్రాంతాలకు నిధులు కేటాయించక పోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో సైతం ఆం దోళన నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓట్లు అడగాలంటే ఆ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలి. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుండగా ఓట్ల కోసం వెళితే నిలదీసే అవకాశం ఉంది.
నిధులు మంజూరు చేయించే బాధ్యత కాంగ్రెస్ నా యకుల పై ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరిన దాఖలాలు లేవు. జిల్లాకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రిని కలిసి ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి సుమారు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నా రు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాల్సిన అవసరం ఉంది.




