29 August, 2026 | 4:53 PM

రజితకు అండగా ఉంటాము: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

29-08-2026 04:05 PM

వెంకటయ్యపల్లిలో దివ్యాంగురాలు రజితను పరామర్శించిన ఎమ్మెల్యే

చొప్పదండి, ఆగస్టు29(విజయక్రాంతి): గంగాధర మండలం వెంకటయ్యపల్లి గ్రామానికి చెందిన  ఇడగొట్టి వెంకటి హారిక దంపతులు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి మూడవ కుమార్తె  ఇడగొట్టి రజిత పుట్టుకతోనే  దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు కష్టపడి చిన్నారిని పెంచుతున్నారు. దివ్యాంగురాలు రజిత పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం వెంకటాయపల్లిలోని ఆమె ఇంటికి స్వయంగా వెళ్లారు. రజిత పరిస్థితిని గమనించి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.

ఎంపీడీవో తో మాట్లాడి రజితకు  వికలాంగుల పెన్షన్ వచ్చేలా చూడాలని ఆదేశించారు.  పెన్షన్ మంజూరు కి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే  రజిత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంకిడి సంధ్య రామచంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ ఆసిఫ్, మోహన్ రెడ్డి,గుర్రం నరస గౌడ్, సురేష్, జయంత్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.