అంగన్వాడీలకు సన్‌రైజ్ సంస్థ కుర్చీలు, టేబుళ్లు వితరణ
కల్లూరు,ఆగస్టు 29 (విజయ క్రాంతి): సన్‌రైజ్ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో మండలంలోని చిన్న కోరుకొండి అంగన్వాడీ కేంద్రాలకు సుమారు రూ.10 వేల విలువైన కుర్చీలు, టేబుల్,ఫ్యాను శనివారం వితరణ చేశారు. కల్లూరులోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ కుంచెం రామకృష్ణ అందించిన ఆర్థిక సహకారంతో సంస్థ ఈ సామగ్రిని అందజేసింది.
ఈ సందర్భంగా సన్‌రైజ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మాలతీదాస్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు ఉపయోగపడతాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్లూరు ఎంపీఓ ఏనుగు సురేష్‌బాబు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుమన్‌బాబు, పంచాయతీ కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలు పాల్గొన్నారు.






