21 March, 2026 | 6:48 PM

Breaking News

ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •   శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి   •   విద్య, నాగరికత, నాగరికతతోనే అభివృద్ధి సాధ్యం   •  

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలి

21-03-2026 12:12 AM
  1.   23న ఢిల్లీలో బీసీల మహా ధర్నా
  2. కుల గణన జరిగి బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఢిల్లీపై పోరాటం ఆగదు
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడి

ముషీరాబాద్, మార్చి 20 (విజయ క్రాంతి): ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా మొదలుకానున్న జాతి జనగణనలో బీసీ కులగనన   చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రం లో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నెల 23న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద బీసీల మహా ధర్నా చేపట్ట నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ మేర కు శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ అద్యక్షుతన 20 బీసీ సంఘాలు, 30 బీసీ కుల సంఘాల  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీల చలో ఢిల్లీ మహా ధర్నా కార్యక్రమం సంభందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జాజుల శ్రీని వాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగన ను చేపట్టాలని బీసీలు ఉద్యమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2025 ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం లో జాతీ జన గణనలో సమగ్ర కులగన చేప డతామని ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు పై జరుగుతున్న ఈ భారీ మహధర్నాకు ఆ ఖిలపక్ష పార్టీల నేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ దర్నాకు దేశంలోని 29 రా ష్ట్రాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇచ్చారు.

బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యని ర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముది రాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ సంఘాని మల్లేశ్వర్, బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, సంచార జాతుల సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి, బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హనుమాన్లు, బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్, కన్వీనర్లు నందగోపాల్, ఉదయ్ నేత, శివమ్మ, గూడూరు భాస్కర్ మేరు, వాణీ, వేణు, వెంకటేష్ గౌడ్, శ్రీనివా స్ గౌడ్, వల్ల బోసు నరసింహ చారి, అనం తోసు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.