1 August, 2026 | 4:27 PM

Breaking News

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •  

సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థి గుండెపోటుతో మృతి

15-12-2025 01:52 AM

మునుగోడు, డిసెంబర్ 14 : మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన కిష్టాపురం గ్రామానికి చెందిన చెనగొని కాటంరాజు(45) సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ గా బీఆర్‌ఎస్ నుండి పోటీ చేశాడు.

గత బుధవారం జరిగిన ఎన్నికల్లో సమీప అభ్యర్థి పై 143 ఓట్లతో ఓడిపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం స్వగ్రామంలో ఓ వ్యక్తి ఇంటిదగ్గర మాట్లాడుతూ హఠాత్తుగా సొమ్మసిల్లీ పడిపోయాడు.వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద హస్పెటల్ కు తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాటంరాజు అకాల మృతి పట్ల ఆ గ్రామంలోని ప్రజలు శోకసముద్రంలో ఉన్నారు.