మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Former CM Nadendla Bhaskara Rao Passes Away) కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల భాస్కరరావు తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా చదివారు. నాదెండ్ల భాస్కరరావు 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం మా తాజా వార్తలు విభాగాన్ని సందర్శించండి.
1984లో నెల రోజులపాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రిచెన్నారెడ్డి, అంజయ్య హయాంలో భాస్కర్ రావు మంత్రిగా పనిచేశారు. 1998లో భాస్కర్రావు ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ భాస్కర్ రావు కుమారుడు. భాస్కరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఇలాంటి రాజకీయ నాయకుల జీవిత విశేషాలు, తాజా రాజకీయ వార్తల కోసం మా రాజకీయ వార్తలు విభాగాన్ని ఫాలో అవ్వండి.
నాదెండ్ల భాస్కరరావు గురించి ముఖ్య విషయాలు:
- జననం: 1935, గుంటూరు
- విద్య: ఉస్మానియా యూనివర్సిటీ (లా)
- ఎమ్మెల్యే: 1978
- సీఎం: 1984 (సుమారు 1 నెల)
- ఎంపీ: 1998, ఖమ్మం






