14 June, 2026 | 4:18 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

52 మంది మావోయిస్టుల లొంగుబాటు

17-01-2026 04:06 AM
  1.   49 మంది తలలపై రూ.1.41 కోట్ల రివార్డు
  2. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు
  3. వివరాలు వెల్లడించిన బీజూపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ 

చర్ల /రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం ౫౨ మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రతా దళాల కూంబింగ్, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల ప్రభావంతో ఈ పరిణామం చోటుచేసుకున్నది. ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన 52 మందిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తంగా 49 మందిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో పార్టీ డివిజనల్ కమిటీ సభ్యుడు లక్కు కరమ్ అలియాస్ అనిల్, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు లక్ష్మీ మాధవి వంటి కీలక నేతలు ఉన్నారు.

వీరంతా దండకారణ్యం, ఆంధ్రా -ఒడిశా సరిహద్దు, మహారాష్ట్రలోని భమ్రాగఢ్ ప్రాంతాల్లో పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పునా మార్గెం’ (కొత్త ఉదయం) పునరావాస పథకం పట్ల ఆకర్షితులై వీరు హింసా మార్గాన్ని వీడారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందింది.