11 April, 2026 | 6:39 AM

2 సెకన్లలో 700 కి.మీ వేగం

28-12-2025 12:13 AM

చైనాలో మాగ్లెవ్ ట్రెయిన్ ప్రయోగం సక్సెస్

బీజింగ్, డిసెంబర్ ౨౭: చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. అత్యాధునిక సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) సాంకేతికతను వినియోగించి రైలు తయారీ ప్రక్రియలో గొప్ప పురోగతి సాధించారు. తాజాగా వారు 1.1 టన్నుల బరువు న్న ప్రయోగాత్మక రైలును తయారు చేసి, దానిని 400 మీటర్ల పొడవైన ట్రాక్‌పై ఈ ప్రయోగించారు. ఆ వాహనం కేవలం రెండు సెకన్లలోనే ౭౦౦ కి.మీ వేగం అందుకుంది. తద్వారా శాస్త్రవేత్తలు ప్రపంచ హైస్పీడ్ రవా ణా రంగంలోనే అరుదైన రికార్డు నెలకొల్పారు.

అంతవేగంలోనూ ప్రయోగాత్మక రై లు పరిధిలో బ్రేకింగ్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘మ్యాగ్లెవ్ రైళ్లు సాధారణ రైళ్లలా కాకుండా అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తాయి.

పట్టాలకు, వాహనానికి మధ్య ఎలాంటి భౌతికపరమైన సంబంధం లేకుండా గాలి లో తేలుతూ ప్రయాణించడం దీని ప్రత్యేకత. చక్రాలు లేకపోవడం వల్ల ఘర్షణ తగ్గి శబ్దం, ప్రకంపనలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ అధునాతన వ్యవస్థ ద్వారా మెకానికల్ అరుగుదల తగ్గి నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. చైనా స్టేట్ బ్రాడ్కాస్టర్ సీసీ టీవీ విడుదల చేసిన దృశ్యాలలో ఈ వాహనం మెరుపు వేగంతో దూసుకుపోతూ కనిపించింది.