17 May, 2026 | 3:39 AM

431 కేజీల గంజాయి పట్టివేత

17-05-2026 12:14 AM

చౌటుప్పల్, మే 16 (విజయక్రాంతి): రాచకొండ నార్కోటిక్ పోలీస్ బృందం, చౌటు ప్పల్ పోలీసులు సంయుక్తంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎస్ 07 జీఎం 4617 నెంబర్ గల మహేంద్ర ఎక్స్ యూవీ వాహనంలో ఐదు కేజీల పాకెట్లు 83, రెండు కిలోల చొప్పున 8 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యయన్నారు. మొత్తం సుమారు 431 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. 

వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీర్ పేట్ జిల్లా లిసాడీ గ్రామానికి చెందిన సలీం, అమన్, అమీరుద్దీన్, ఫిరోజ్ అనే వ్యక్తులు రాజమండ్రి ప్రాంతానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి నుంచి గంజాయిని సేకరించి నకిలీ నెంబర్ ప్లేట్ అమర్చిన వాహనంలో ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వీరిలో సలీం, అమన్ లు పట్టుబడగా అమీరుద్దీన్, ఫిరోజ్ లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.