17 August, 2026 | 5:09 PM

Districts - Kumarambheem Asifabad

article_55660614.webp
30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పెంచికల్పేట్ (విజయక్రాంతి): దహేగాం మండలంలోని చిన్నరాసపల్లి పరిసర గ్రామాల కార్డుదారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పెంచికల్పేట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాజ్‌కుమార్, పెంచికల్పేట్ ఎస్సై అనిల్‌కుమార్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. టాటా పికప్ వాహనం (AP 01 Y 4233)లో 60 బస్తాల్లో తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన ఖాజా, అస్లాం హుస్సేన్‌లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్‌కుమార్ హెచ్చరించారు. తనిఖీల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

17-08-2026

article_72580893.webp
రోడ్డెక్కిన రైతులు.. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు(Vattivagu Project) ఆయకట్టు కింద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బూరుగుడా సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సాగునీరు అందకపోతే రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

17-08-2026

article_31913788.webp
అంగరంగ వైభవంగా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన

బెజ్జూర్ ఆగస్టు 16 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి, బెజ్జూర్ గ్రామాల సమీపంలోని నాగుల చెరువు సమీపంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాగజ్నగర్ త్రినేత్ర ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం శాస్త్రి వేద పండితుల సమక్షంలో విగ్రహ పుణ: ప్రతిష్టాపన,ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సహకరించిన దాతలు అందరికీ ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ అధ్యక్షులు తంగేడి పల్లి మహేష్, ఎలుక పెళ్లి హనుమాన్ ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్, కుడ్రంగి రామకృష్ణ, సిద్దాపూర్ సర్పంచ్ చెండే పద్మ శంకర్ విలేకరుల బృందం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

16-08-2026

article_25848740.webp
బెజ్జూరు ఉత్తమ ఆశా వర్కర్ గా పార్వతి

బెజ్జూర్ ఆగస్ట్ 15 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం ఉత్తమ ఆశ వర్కర్ గా ఆయిల్ల పార్వతికి ఆసిఫాబాద్ డిఎంహెచ్వో నాగేందర్, ప్రశంస పత్రాన్ని అందజేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మండల ఉత్తమ ఆశా వర్కర్ గా ఆయిల్లో పార్వతికి ప్రశంస పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇలా మూడుసార్లుగా ఉత్తమ ఆశా వర్కర్ గా ప్రశంస పత్రం అందుకోవడం అభినందనీయమని డి ఎం హెచ్ ఓ నాగేంద్ర అభినందించారు. పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆశా వర్కర్ పార్వతి కృషి అభినందనీయమని అన్నారు. ఆశ పార్వతిని అందరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

15-08-2026