15 August, 2026 | 12:46 PM

బెజ్జూరు ఉత్తమ ఆశా వర్కర్ గా పార్వతి

15-08-2026 12:16 PM

బెజ్జూర్ ఆగస్ట్ 15 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం ఉత్తమ ఆశ వర్కర్ గా ఆయిల్ల పార్వతికి ఆసిఫాబాద్ డిఎంహెచ్వో నాగేందర్, ప్రశంస పత్రాన్ని  అందజేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మండల ఉత్తమ ఆశా వర్కర్ గా ఆయిల్లో పార్వతికి ప్రశంస పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇలా మూడుసార్లుగా ఉత్తమ ఆశా వర్కర్ గా ప్రశంస పత్రం అందుకోవడం అభినందనీయమని డి ఎం హెచ్ ఓ నాగేంద్ర అభినందించారు. పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆశా వర్కర్ పార్వతి కృషి అభినందనీయమని అన్నారు. ఆశ పార్వతిని అందరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.