16 August, 2026 | 6:01 PM

అంగరంగ వైభవంగా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన

16-08-2026 04:37 PM

బెజ్జూర్ ఆగస్టు 16 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి, బెజ్జూర్ గ్రామాల సమీపంలోని నాగుల చెరువు సమీపంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాగజ్నగర్ త్రినేత్ర ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం శాస్త్రి వేద పండితుల సమక్షంలో విగ్రహ పుణ: ప్రతిష్టాపన,ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సహకరించిన దాతలు అందరికీ ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ అధ్యక్షులు తంగేడి పల్లి మహేష్, ఎలుక పెళ్లి హనుమాన్ ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్, కుడ్రంగి రామకృష్ణ, సిద్దాపూర్ సర్పంచ్ చెండే పద్మ శంకర్ విలేకరుల బృందం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.