2 September, 2026 | 4:31 PM

జన హృదయ నేతకు ఘన నివాళులు

02-09-2026 | 03:02pm

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగుల అనంతలక్ష్మీరెడ్డి

గండీడ్: మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షుడు గంగుల అనంతలక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ, 108 సేవలు, విద్యార్థులకు ఉచిత ఫీజు రీయింబర్స్‌మెంట్, వృద్ధాప్య పెన్షన్‌ను రూ.200కు పెంపు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. రైతులు, పేదలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఆయనను దేవుడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు.