యూత్ లీడర్షిప్ సదస్సు
నిర్మల్,(విజయ క్రాంతి): "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక శిక్షణ కేంద్రం (ఐటిఐ) లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. "యూత్ లీడర్ షిప్ సమ్మిట్" అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలువురు అధికారులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, దేశ రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. యువజన, క్రీడల శాఖ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.






