50 మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక
ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదల, జూన్ 23: యువతను ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం చేయకుండా, వారికి కష్టసుఖాల్లో అండగా నిలబడటమే నిజమైన నాయకత్వ లక్షణమని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది యువకులు ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నాయకుడి కోసం, పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడే యువతను ఎన్నికల సమయంలో, ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే గుర్తు చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. పార్టీ కోసం నిలబడిన వారికి అవసరం వచ్చినప్పుడు అండగా నిలవడం, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం కూడా నాయకుల బాధ్యతేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సురభి కుమార్ గౌడ్, సంజీవరెడ్డి, కిషన్, పార్టీ నాయకులు, హుస్సేన్, తుపాకుల రాజు, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,సత్యనారాయణ, శేఖర్ రెడ్డి,మహేష్, మురళి, గౌస్ రవి, భాస్కర్, సాయి కార్యకర్తలు పాల్గొన్నారు.






