రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
12-08-2026 09:44 AM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌటా(భి) గ్రామానికి చెందిన కుమ్మరి రాకేష్ (30) అనే యువకుడు మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్ నుండి ఆయన స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మృతునికి భార్య తో పాటు ఇరువురు పిల్లలు ఉన్నారు. గత నాలుగు నెలల క్రితం మృతుడు కుటుంబాన్ని పోషించడం కోసం ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి రావడం జరిగింది. అయితే ఇటీవలే ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబీకులు పేర్కొంటున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






