calender_icon.png 16 February, 2026 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో యువజంట మృతి

16-02-2026 12:20:44 AM

ఢిల్లీలో లాక్ చేసిన కారులో మృతదేహాలు 

ప్రేమ వ్యవహారమే కారణమా?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 : అనుమానాస్పద స్థితిలో ఓ యువజంట మృతిచెందింది. నో యిడా సెక్టార్ 39 సమీపంలో ఆగి ఉన్న టా టా ఆల్ట్రోజ్ కారులో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ప్రేమికుల రోజున ఈ విషాదకర వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. మృతులను సుమిత్, రేఖగా గుర్తించారు. వారి తలలకు తుపాకీ గాయాలు ఉ న్నాయి. ఈ ఘటన ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. కారు లోపల నుంచి లాక్ చేసి ఉంది. డ్రైవర్ సీటులో ఉన్న సుమిత్ చేతిలో పిస్టల్ కనిపించింది.

సుమిత్ మొదట రేఖను కాల్చి ఆ తర్వాత తనను తా ను కాల్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నా రు. కారులో ఖాళీ తూటాలు దొరికాయి. మృతుడు సుమిత్ ఢిల్లీలోని త్రిలోక్‌పురి నివాసి. యువతి రేఖ నోయిడా సెక్టార్ 58లో నివసించేది. వీరిద్దరూ శుక్రవారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుం బ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదులు చేశారు. సుమిత్ రాసిన ఒక లేఖ పోలీసులకు లభించింది. తాము 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామ ని అందులో పేర్కొన్నాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటాన్ని తట్టుకోలేక ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

రేఖ బం ధువులు మాత్రం మరో రకంగా చెబుతున్నా రు. సుమిత్ ఆమెను చాలా కాలంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. మరోవైపు సు మిత్ కుటుంబ సభ్యులు ఇది పరువు హత్య అని అనుమానిస్తున్నారు. తమకు కులం పే రుతో బెదిరింపులు వచ్చాయని వారు చెబుతున్నారు. కారుదొరికిన ప్రాంతం యువతి గ్రామానికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఇది తమకు అనుమానంగా ఉందని సుమిత్ బంధువులు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తోంది.