28 June, 2026 | 3:12 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

చమురు కొనుగోళ్లపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు

16-02-2026 12:22 AM

రాజకీయాలకంటే దేశ ఇంధన భద్రతకే ప్రాధాన్యం

భారత విదేశాంగ మంత్రి జైశంకర్

బెర్లిన్, ఫిబ్రవరి 15 : చమురు కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. కొనుగోళ్లు అనేవి జాతీయ ప్రయోజ నాలపై ఆధారపడి ఉంటాయని చెప్పార. జర్మనీలోని మ్యూని సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు జైశం కర్ హాజరయ్యారు. దీని భాగంగా ఆయన మాట్లాడుతూ... భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుందన్నారు.

ఇంధన సమస్యల విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్ సంక్షిష్టంగా ఉంది. భారత్‌లోని చమురు కంపెనీలు యూరప్‌తో సహా ప్ర పంచంలోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తాయి. ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి.. వారి ప్రయోజనాలకు తగ్గ ట్లు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

అమెరికా తో ఇటీవల ఇండియాకు మధ్యంతర వాణి జ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో భారత దిగుమతులపై సుంకాలను అమెరికా 18 శాతానికి తగ్గించింది. ఈ క్ర మంలో రష్యా చమురు కొనుగోళ్ల ఠను నిలిపివేసేందుకు ఆ దేశం కట్టుబడి ఉందంటూ అమెరికా ప్రకటించింది. విదేశాంగ మంత్రి తాజా వ్యాఖ్యలతో యూఎస్‌ఏకు సమాధానం ఇచ్చినట్లయింది.