5 May, 2026 | 11:54 AM

అక్రమ మైనింగ్‌పై హైడ్రా కొరడా

05-05-2026 10:38 AM

హైదరాబాద్: అక్రమ మైనింగ్ పై హైడ్రా(HYDRAA) కఠిన చర్యలు చేపట్టింది. ఒకేరోజు ఆరు ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు చేసింది. ఆరు క్రషింగ్ యూనిట్లను హైడ్రా సిబ్బంది తొలగించారు. క్రషింగ్ యూనిట్లతో పాటు 12 ఆర్ఎంసీ ప్లాంట్లు తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత శాఖల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది. పీసీబీ, మైనింగ్ , రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. పీసీబీ, మైనింగ్ , రెవెన్యూ విభాగాలు హైడ్రా సహకారం కోరాయి. రూ. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మైనింగ్, క్రషింగ్, ఆర్ ఎంసీ ప్లాంట్లు బడాబాబుల అండతో నడుస్తున్నాయి. బడాబాబుల పైరవీలతో నడుస్తున్న యూనిట్లపై ఆయా శాఖల ఫిర్యాదుతో హైడ్రా చర్యలు చేపట్టింది.

హైడ్రా కూల్చిన 6 అక్రమ మైనింగ్ యూనిట్లు ఇవే.

• రాఘవ స్టోన్ క్రషర్(Raghava Stone Crusher) - కొత్వాల్‌గూడ

• గ్రేట్ ఇండియా మైనింగ్ కంపెనీ - గౌలిదొడ్డి

• పరమేశ్ సింగ్ స్టోన్ క్రషర్ / శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ - వత్తినగులపల్లి

• పృథ్వీ స్టోన్ క్రషర్

• మక్త భగత్ సింగ్‌తో సంబంధం ఉన్న కార్యకలాపాలు

ఈ యూనిట్లు పిసిబి, మైనింగ్ అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. దీనివల్ల భారీ కాలుష్యం, వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. భవిష్యత్ కార్యకలాపాలను నిరోధించడానికి యంత్రాలు తొలగించబడ్డాయని అధికారులు ప్రకటించారు.