5 May, 2026 | 11:46 AM

తై బజార్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

05-05-2026 10:43 AM

విజయక్రాంతి ఎఫెక్ట్...  వార్తా కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్.

నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ప్రకటన.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పంటను రక్షించుకొని తీరా అమ్ముకుందామనుకున్న మామిడి రైతులకు అధికార పార్టీకి చెందిన కొంతమంది లీడర్లు తైబజార్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వీధి విక్రయ వ్యాపారులు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో సోమవారం తైబజార్ పేరుతో అక్రమ వసూళ్లు అనే వార్త కథనాన్ని విజయక్రాంతి ప్రచురించింది.

ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తై బజార్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలే నష్టాల్లో ఉన్న మామిడి రైతులు, కూలీలు వ్యాపారుల వద్ద అడ్డగోలుగా వసూలు చేయడం సరికాదన్నారు.

వీధి వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారుల నుండి అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ కనీసం రసీదులు కూడా ఇవ్వకుండా దోచుకుంటున్నారన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు.  వివిధ రకాల వ్యాపారస్తుల నుండి సేకరించే రేట్లను పేర్కొంటూ కాంట్రాక్టర్కు  మున్సిపాలిటీ నుండి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. అంతకుమించి ఎక్కువగా వసూలు చేస్తే మున్సిపల్ కార్యాలయంలోని మేనేజర్ వెంకటయ్యని  9490602747 సంప్రదించాలాన్నారు.