5 May, 2026 | 12:35 PM

న్యాయమూర్తి నారం అరుణ్ కుమార్‌కు ఘన సన్మానం

05-05-2026 11:11 AM

​ఆమనగల్: ఆమనగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన  నారం అరుణ్ కుమార్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి నుండి బదిలీపై వచ్చి ఆమనగల్ కోర్టులో బాధ్యతలు చేపట్టిన ఆయనకు న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు.​బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకర్ యాదిలాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ శర్మ, దుడ్డు ఆంజనేయులు, మల్లేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.