21 June, 2026 | 10:52 PM

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధం

21-06-2026 04:40 PM

నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగరాజు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యానికి యోగ దివ్య ఔషధంగా  పనిచేస్తుందని యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన. నాగరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయం నందు సిబ్బందికి యోగపై అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సిబ్బందికి యోగ మాస్టర్ చామకూరి వీరయ్య గౌడ్  యోగ ధ్యానం శారీరక వ్యాయామంపై  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.