ప్రపంచానికి మన దేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా
కలెక్టర్ చాహాత్ బాజ్పాయి
హనుమకొండ, జూన్ 21 (విజయక్రాంతి): ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయి అన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం2026 సందర్భంగా ఆదివారం ఉదయం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యోగ నిపుణుల సమక్షంలో ఆసనాలు, ప్రాణాయామం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ దుర్గా రామ్ కుమార్, డివైఎస్ ఓ ప్రశాంత్, డీపీఆర్‌ఓ ఆయూబ్ అలీ, బోద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్, సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ మహేందర్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భాను, డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ జి రాము, డాక్టర్ శోభారాణి, డాక్టర్ సతీష్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ మమతా మాధవి, ఇన్స్పెక్టర్లు ప్రభు చైతన్య, రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్, జిల్లా స్పోరట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.






