బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్ గా యెజ్డీ రోడ్ స్టర్
పూణె, మార్చి 2026: జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ కు చెందిన ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్’ యెజ్డీ రోడ్ స్టర్ “బైక్ డిజైన్ ఆఫ్ ది ఇయర్” అవార్డ్ ను గెలుచుకుంది. మోటార్ సైకిల్ రంగంలో ఇది అతిపెద్ద గుర్తింపుగా చెప్పొచ్చు. మార్కెట్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అందరినీ ఆకట్టుకున్న యెజ్డీ రోడ్ స్టర్ కు పలు అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలో జీ మీడియా ఆటో అవార్డ్స్ లో రోడ్ స్టర్ ఉత్తమమైన 350 సిసి మోటార్ సైకిల్ గా కూడా ఎంపికైంది. ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ థామర్ దాల్, స్ట్రేట్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఇండియా యొక్క డీన్ నుండి క్లాసిక్ లెజెండ్స్ సహ-స్థాపకుడు బొమన్ ఇరాని ఈ అవార్డ్ అందుకున్నారు. గత మోడల్స్ తో పోలిస్తే స్థిరమైన రూపురేఖలు, బలమైన మాడ్యులార్ విలక్షణతలకు ఇది గుర్తింపుగా చెప్పుకొచ్చారు.
కంపెనీ వారి డిజైన్ -ఫస్ట్ విధానం యెజ్డీ రోడ్ స్టర్ ను ఊహించనివిధంగా రెట్రో టెంప్లెట్స్ ను మించి ముందుకు దూసుకెళ్లింది. 12.5 లీటర్ ఇంధనం ట్యాంక్ , లిక్విడ్-కూల్డ్ 350 సిసి ఆల్ఫా2తో, శ్రేణిలో మొదటి 6-స్పీడ్ గేర్ బాక్స్ మరియు హుడ్ కింద అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ తో, రోడ్ స్టర్ రైడర్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. డిజైన్ విషయంలో తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలు యెజ్డీకి ఈ అవార్డును తెచ్చిపెట్టాయని క్లాసిక్ లెజెండ్స్ కో ఫౌండర్ బొమన్ ఇరాని వ్యాఖ్యానించారు. మరోవైపు డిజైన్ వివరాలు చెప్పడం చాలా సులభమనీ, అయితే అమలు చేయడం మాత్రం సవాల్ తో కూడుకున్నదని యెజ్డీ మోటార్ సైకిల్స్ కాన్సప్ట్ డిజైన్ హెడ్ అఖిలేష్ మన్ చందాని చెప్పారు.




