ప్రాచీన శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన యాదవ సంఘం నాయకులు
సెప్టెంబర్ 4న జన్మాష్టమి వేడుకలకు సన్నాహాలు
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని ప్రాచీన కాలం నాటి శ్రీకృష్ణ (వేణుగోపాలస్వామి) ఆలయాన్ని యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. రాబోయే సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలను పరిశీలించి, ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్శనలో శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు కానుగంటి ముత్తయ్య యాదవ్, పాల్గొన్నారు. వారితో పాటు కమిటీ ఉపాధ్యక్షులు దండబోయిన హరిప్రసాద్ యాదవ్, వారాల రమేష్ యాదవ్, శోభనబోయిన శివరాజ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూరి పాండు యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధుల నుండి గోవర్ధనగిరి సర్పంచ్ తోటకూరి సదానందం యాదవ్, రాఘవపూర్ సర్పంచ్ మెరుగు క్రాంతి యాదవ్, చిటకోడూరు సర్పంచ్ కూకట్ల యాదగిరి యాదవ్, యశ్వంతపూర్ సర్పంచ్ బొల్ల సంపత్ యాదవ్, మరియు జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జన్మాష్టమి ఏర్పాట్లపై చర్చ
ఆలయ పునరుద్ధరణ, పూజా కార్యక్రమాలు, భక్తులకు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై కమిటీ సభ్యులు సమావేశమై చర్చించారు. ప్రాచీన ఆలయ పవిత్రతను కాపాడుతూ, యువతను భాగస్వామ్యం చేసి జన్మాష్టమిని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ, గోవర్ధనగిరి ఆలయం యాదవ కులస్తులకు ఆరాధ్య దైవంగా ఉందని, ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారని తెలిపారు ఆలయానికి సంబంధించిన తగు ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవా కమిటీ సభ్యులు డిమాండ్ డిమాండ్ చేశారు.






