17 May, 2026 | 1:04 AM

ఈ గవర్నెన్స్ రేసులో ‘యాదగిరిగుట్ట’

17-05-2026 12:00 AM

ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆలయాన్ని సందర్శించిన జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల బృందం  

యాదగిరిగుట్ట, మే 16 (విజయక్రాంతి): తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టాత్మకమైన 29వ జాతీయ ఈగవర్నెన్స్ అవార్డుకు చేరువైంది. ఢిల్లీలో జరిగిన ఈగవర్నెన్స్ సదస్సులో ఆలయంలో అమలు చేస్తున్న డిజిటల్ సేవలపై ఆలయ ఈవో జే.భవాని శంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి 802 దరఖాస్తులు రాగా, ఉత్తమంగా ఎంపికైన 32 ప్రాజెక్టుల్లో యాదగిరిగుట్ట దేవస్థానం చోటు దక్కించుకుంది.

ఏప్రిల్ 8,9 తేదీల్లో జాతీయ ఈగవర్నెన్స్ అవార్డుల బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి డిజిటల్ సేవ లను క్షేత్రస్థా యిలో పరిశీలించింది.శుక్రవా రం ఢిల్లీలో జరిగిన ఫైనల్ ప్రెజెంటేషన్లో యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ సదుపాయాల గురించి వివరించారు. భక్తులకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు వినూత్న డిజిటల్ విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సేవలతో యాదగిరిగుట్ట ఆలయానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావ డం గర్వకారణమని, ప్రతిష్టాత్మక ఈగవర్నె న్స్ అవార్డు ఆలయాన్ని తప్పక లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.