9 August, 2026 | 10:54 AM

నీ మీద కేసు నమోదైంది అంటూ 26 వేలు టోకరా...

09-08-2026 09:32 AM

సిర్గాపూర్ ఆగస్టు 09(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని లక్ష్మణ్ నాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తి కి మీ మీద కేసు నమోదైంది’ అంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.26 వేలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులమని నమ్మించి భయపెట్టి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. కంగ్డి సీఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని లక్ష్మణ్నాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీ పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వీడియోకాల్ చేసి నీ వేధింపులతో ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని, నీ పై FIR నమోదైందని, నీపై కేసు దాపిపి తొలగించాలంటే డబ్బులు పంపిస్తే కేసు తీసివేస్తామని బెదిరించారు. భయపడిన సదరు వ్యక్తి రెండు దఫాలుగా రూ.26 వేలు పంపించాడు. బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంగ్టి సీఐ వెంకట్ రేడ్డి తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే ఎలాంటి డబ్బులు పంపకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి సూచించారు.