19 August, 2026 | 7:41 PM

ఈశ్వితని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

19-08-2026 07:03 PM

- ఈశ్వితకు శాలువా కప్పి సన్మానిస్తున్న ఊకే బుచ్చయ్య

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుండెబోయిన లక్ష్మినారాయణ కుమార్తె ఈశ్విత ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కరాటే పోటీలో పాల్గొని గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన విషయం తెలుసుకుని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య వారి నివాసానికి వెళ్లి చిన్నారి ఈశ్వితని సన్మానించారు. అనంతరం బుచ్చయ్య మాట్లాడుతూ.. చిన్నారి ఈశ్విత చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ అఫ్ వర్డల్ రికార్డ్స్ లో పేరు సంపాదించడం మన మండలానికే గర్వ కారణం అని అన్నారు.

ఆ చిన్నారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 1212 మంది పాల్గొన్న ఈ కరాటే పోటీలో చిన్న వయసులో, అంతా మంది మధ్యలో పోరాడి నిలిచిన ఈశ్విత దైర్యం చూస్తుంటే చాలా గర్వంగా అనిపించిందని, ఇలాగే భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని, వారికి మా పార్టీ తరుపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వాంకుడోత్ రమేష్, ఎస్కే కాశీం,  పల్లపు రాజేష్, నూనావత్ రవి, బానోత్ నరేందర్, గడ్డం రాజేష్, తిర్రి సుగుణ తదితరులు పాల్గొన్నారు.